రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక: కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతిచ్చిన టీడీపీ

                                

Last Updated : Aug 8, 2018, 02:08 PM IST
రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక: కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతిచ్చిన టీడీపీ

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి బీకే హరిప్రసాద్కి మద్దతు ఇస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ కి చెందిన ఎంపీ సుజనా చౌదరీ ప్రకటించారు. తమ పార్టీ అధినేత ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్ధి బీకే హరిప్రసాద్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇటీవలె కాంగ్రెస్ - జేడీఎస్ ఉమ్మడి అభ్యర్ధి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్వానికి వెళ్లిన చంద్రబాబు.. తాజాగా కాంగెస్ అభ్యర్ధికి మద్దతిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

Trending News