Earthquake: బంగాళాఖాతంలో భూకంపం, భారీగా పోటెత్తిన అలలు, సునామీ హెచ్చరిక జారీ చేశారా

Earthquake: భూమి ఈ మద్య కాలంలో తరచూ అలజడికి లోనవుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2023, 10:34 AM IST
Earthquake: బంగాళాఖాతంలో భూకంపం, భారీగా పోటెత్తిన అలలు, సునామీ హెచ్చరిక జారీ చేశారా

Earthquake: మొన్న ఆప్ఘనిస్తాన్..నిన్న నేపాల్ భారీ భూకంపాలకు తోడు దేశంలో ఉత్తరాదిన తరచూ భూమి కంపిస్తూ వస్తోంది. చిన్న చిన్న ప్రకంపనలే అయినా తరచూ వస్తుండంతో ఆందోళన రేగుతోంది. ఇవాళ తెల్లవారుజామున బంగాళాఖాతంలో భూకంపం రావడంతో కెరటాలు ఒక్కసారిగా పోటెత్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ హెచ్చరికలు మాత్రం జారీ కాలేదు.

వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం నేపాల్‌లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి 150 మందికి పైగా మృత్యువాత పడగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ తరువాత కూడా ఖాట్మండూలో నిన్న ఉదయం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక ఉత్తరాఖండ్ పితోరీగఢ్ జిల్లాలో నిన్న 5.6 తీవ్రతతో భూమి కంపించింది. గతవారం సంభవించిన నేపాల్ భూకంపం ప్రభావం దేశంలో ఢిల్లీ, హర్యానా, బీహార్, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై కన్పించింది. అయోధ్యలో కూడా మొన్న భూమి స్వల్పంగా కంపించింది. వరుస భూ కంపాలు, ప్రకంపనలతో ఆందోళన చెందుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఇవాళ తెల్లవారుజామున భూకంపం వచ్చింది.

ఇవాళ ఉదయం 5.32 గంటలకు భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఫలితంగా అలలు తీరం వైపుకు పోటెత్తాయి. అండమాన్ నికోబార్ దీవులకు వాయువ్యంగా 200 నాటికల్ మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు వచ్చాయి. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా అండమాన్ నికోబార్ తీరంలో అలలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి, సముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ మప్పు లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Also read: Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు, కొలీజియం సిఫారసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News