దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం పూట ఎండ వేడిమి విపరీతంగా ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఢిల్లీ, హరియాణా ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. ఆకాశంలో నల్లమబ్బులు కమ్మేయడంతో వెలుతురు పోయి చీకటిగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వేగంగా గాలులు వీయడం ప్రారంభమైంది. రోడ్లపై నుంచి విపరీతంగా దుమ్మురేగింది. ఓ వైపు చీకటి, మరోవైపు దుమ్ము కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చీకటి కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇళ్లల్లోనూ ప్రజలు లైట్లు వేసుకున్నారు.
మరోవైపు కొద్దిసేపటికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన దేశ రాజధాని వాసులకు ఉపశమనం కలిగింది.
#WATCH Dust storm envelops #Delhi in a sudden change of weather; Visuals from Gazipur area pic.twitter.com/GEot2byafd
— ANI (@ANI) May 10, 2020