PM Modi: వ్యాక్సిన్ వచ్చేంత వరకు నిర్లక్ష్యం వద్దు: ప్రధాని

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) భారత దేశంలో తీవ్ర రూపం దాల్చింది. 

Last Updated : Sep 12, 2020, 04:44 PM IST
    • ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) భారత దేశంలో తీవ్ర రూపం దాల్చింది.
    • ప్రపంచంలో అమెరికా తరువాత భారత్ లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.
    • అదే సమయంలో భారత్ లో అన్ లాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
PM Modi: వ్యాక్సిన్ వచ్చేంత వరకు  నిర్లక్ష్యం వద్దు: ప్రధాని

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) భారత దేశంలో తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో అమెరికా తరువాత భారత్ లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో భారత్ లో అన్ లాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రజాజీవితం మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు అని హితవు పలికారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ).

కరోనావైరస్ ను తేలిగా తీసుకోరాదు అని తెలిపారాయన. కోవిడ్ -19 కు ( Covid-19) వ్యాక్సిన్ డెవలెప్ అయి అందుబాటులోకి వచ్చేంద వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే అని సూచించారు ప్రధాని. 

మధ్యప్రదేశ్ లో ప్రధాన మంత్రి ఆవాస యోజన కార్యక్రమంలో నిర్మించిన ఇండ్లకు నేడు ప్రధాని గృహ‌ప్ర‌వేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కరోనావైరస్ కు మందు రానంత వరకు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు అన్నారు. ముఖానికి మాస్క్ ( Face Mask ) తప్పనిసరిగా ధరించాలి అని, వ్యక్తుల మధ్య రెండు గజాల దూరం పాటించాలి అని సూచించారు ప్రధాని.

Trending News