Delhi Woman Dies: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. యువతిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!

Woman was dragged by the car for 12 kilometres in Delhi. న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 2, 2023, 09:29 AM IST
  • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
  • యువతిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
  • అక్కాచెల్లెళ్లతో పాటు ఇద్దరు సోదరులు
Delhi Woman Dies: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. యువతిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!

Delhi woman dies after Car dragged for 12 km at New Year 2023: న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది. అంతేకాకుండా ఆ యువతిమీ 10-12 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో యువతి శరీరం మొత్తం ఛిద్రం అయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం (2023 జనవరి 1) తెల్లవారుజామున ఢిల్లీలో జరగ్గా.. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే ఈ యాక్సిడెంట్ నూతన సంవత్సరం రోజున జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... 

అంజలి (20) అనే యువతి ఢిల్లీ ప్రాంత నివాసి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో పార్ట్ టైమ్ వర్కర్‌గా పనిచేస్తుంది. 31న రాత్రి ఓ ఫంక్షన్‌కు హాజరై.. ఆదివారం మధ్య రాత్రి ఇంటికి స్కూటీపై తిరిగి వెళ్తూ ఉంది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు సుల్తాన్‌పురి నుంచి ఢిల్లీలోని కంఝవాలా వరకు 10-12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి చనిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.

యువతిని ఈడ్చుకెళ్తున్నట్లు చెప్పిన వారు.. కారు నంబరు కూడా చెప్పడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. మార్గమధ్యలో ఉన్న అన్ని చెక్‌ పోస్టులను పోలీసులు అలర్ట్‌ చేశారు. కారు నంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. అందులో ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వారు మత్తులో ఉన్నారా? లేదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంజలి తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. తల్లి, నలుగురు అక్కాచెల్లెళ్లతో పాటు ఇద్దరు సోదరులతో ఉన్నట్లు సమాచారం.

అత్యాచారం చేసి హత్య చేసినట్లు బాధితురాలు అంజలి తల్లి ఆరోపిస్తోంది. కారులోని ఐదుగురు వ్యక్తులు తన కూతురుపై అత్యాచారం జరిపారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మారుతీ సుజుకీ బాలెనో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులలో ఒకరు క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్. డ్రైవర్, రేషన్ షాపు యజమాని కూడా కారులో ఉన్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని కూడా చెప్పారు. 

Also Read: Gold Price Today: రూ.56 వేల చేరువలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?  

Also Read: Shani shukra Yuti 2023: శని శుక్ర యుతి 2023.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఇల్లు నిండా డబ్బే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News