Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ

Delhi Air Pollution Today: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత తగ్గిపోయింది. గాలి నాణ్యత ఇండికేటర్ 432కి చేరినట్లు వాయు నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడమే (Delhi Air Pollution Causes) ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 12:11 PM IST
    • దేశ రాజధాని ఢిల్లీ మరింత పెరిగిన వాయు కాలుష్యం
    • ప్రమాదకర స్థాయి 432కి చేరిన గాలి నాణ్యత సూచీ
    • కాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్ సర్కారు చర్యలు
Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ

Delhi Air Pollution Today: ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ మరింత పెరిగిపోతుంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత (Delhi Air Pollution Causes) క్షీణించిందని తెలుస్తోంది. దిల్లీలో వాయు నాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది.

మొత్తంగా దేశరాజధానిలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో (Air Quality Index India) కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్​ క్యాంపస్​.. 466 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ ఢిల్లీ ప్రాంతంలో(441), లోధి రోడ్డు(432), పూసా రోడ్డు(427) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయం, ఇండియా గేట్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆకాశంలో పొగమంచు పొరలా ఆవరించింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్‌ సర్కారు (Delhi Govt Air Pollution) ఇప్పటికే చర్యలు చేపట్టింది. రహదారుల మీద నీటిని చల్లేందుకు వాటర్ ట్యాంకర్లను మోహరించింది. స్మాగ్ గన్స్‌ను ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. 

Also Read: Chennai floods: చెన్నైని ముంచెత్తుతున్న వరద నీరు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఎంకే స్టాలిన్ 

Also Read: Corona Cases Rising Again: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో 11,451 కొత్త కేసులు, 266 మరణాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News