Delhi Liquor Scam:లిక్కర్ స్కాంలో కవిత జైలుకేనా? ఈడీ చేతిలో రామచంద్ర పిళ్ళైతో బిజినెస్ డీల్ చిట్టా!

MLC KAVITHA IN Delhi Liquor Scam:దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అడ్డంగా బుక్కయ్యారా? స్కాంలో ఆమె పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించాయా? అంటే అవుననే తెలుస్తోంది

Written by - Srisailam | Last Updated : Sep 7, 2022, 12:42 PM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం
  • కవితకు రామచంద్రకు బిజినెస్ డీల్స్
  • పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ
Delhi Liquor Scam:లిక్కర్ స్కాంలో కవిత జైలుకేనా? ఈడీ చేతిలో రామచంద్ర పిళ్ళైతో బిజినెస్ డీల్ చిట్టా!

MLC KAVITHA IN Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అడ్డంగా బుక్కయ్యారా? స్కాంలో ఆమె పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించాయా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ , రాష్ట్ర నేతలు చెబుతున్నదే నిజం కాబోతోందని.. సీబీఐ, ఈడీ దూకుడుతో ఎమ్మెల్సీ కూతురు జైలుకు వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతుండగానే ఈడీ రంగంలోకి దిగింది. మంగళవారం ఏకకాలంలో దేశవ్యాప్తంగా 32 చోట్ల దాడులు నిర్వహించింది. 

హైదరాబాదులోని  ఆరు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసు ఎఫ్ఐఅర్ లో ఏ14గా ఉన్న హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై నివాసంలో ఈడీ సోదాలు చేసింది.రామచంద్ర పిళ్ళైతో పాటు బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ ఇండ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. మద్యం వ్యాపారి  రామచంద్ర పిళ్ళై నివాసంలో ఈడీ అధికారులకు కీల‌క ఆధారాలు లభించాయని తెలుస్తోంది. రామచంద్ర పిళ్ళై తో తెలంగాణా రాజకీయ ప్ర‌ముఖుల‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ.. వాళ్లతో ఉన్న వ్యాపర లావాదేవీలకు సంబంధించిన లింకులు బయటపెట్టే పనిలో పడిందని అంటున్నారు. 

హైదరాబాద్ లో నిర్వహించిన ఈడీ సోదాలతో అడికోర్ కంపెనీ తెరపైకి వచ్చింది. అడికోర్ సంస్థను 2010లో సూదిని సృజ‌న్‌రెడ్డి, క‌ల్వ‌కుంట్ల క‌విత‌లు డైరెక్ట‌ర్‌లుగా ఉన్నారు. అడికోర్ కంప‌నీకి చెందిన ప‌లు డాక్యుమెంట్ల‌ను సోదాల్లో గుర్తించింది ఈడీ. దీంతో అడికోర్ కంపెనీతో రామచంద్ర పిళ్లై వ్యాపార లింకులపై ఆరా తీస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన సంచలన విషయాలు బయటికి వచ్చాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  కవిత కుటుంబంతో పిళ్ళై తిరుమల వెళ్లి పూజ‌లు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టే పిళ్లై కుటుంబ సభ్యులు కవితతో కలిసి తిరుమల వెళ్లారని భావిస్తున్నారు. దీంతో రామచంద్ర అక్రమ దందాలో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయమనే ప్రచారమే సాగుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News