దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్యం ( Delhi Pollution ) గురించి అందరికీ తెలుసు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య సమస్యను అధగమించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో దేశ రాజధాని నగరం డిల్లీ ఒకటి. కాలుష్య సమస్య నుంచి విముక్తి పొందేందుకు వివిధ రకాల ప్రణాళికలు రచిస్తూనే ఉన్నా పరిష్కారం లభించడం లేదు. ఆడ్ ఈవెన్ నెంబర్ ఫార్ములా ( Odd Even number Formula ) తో పెద్దగా లాభం ఉండటం లేదు. ఈ కాలుష్యానికి తోడు అక్టోబర్ -నవంబర్ నెలల్లో రైతులు కాల్చే పంటల ద్వారా మరింత కాలుష్యం పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm Arvind kejriwal ) కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో అత్యంత రద్దీ ప్రాంతమైన కన్నాట్ ప్లేస్ ( Connaught place ) లో స్మాగ్ టవర్ ( Smog Tower ) నిర్మించనున్నట్టు ప్రకటించారు. కాలుష్యం నుంచి విముక్తి పొందడానికి 20 కోట్ల ఖర్చుతో స్మాగ్ టవర్ నిర్మిస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ నిధులతో ఆనంద్ విహార్ ( Anand vihar ) ప్రాంతంలో స్మాగ్ టవర్‌ను నిర్మిస్తున్నది. గాలిలో ఉన్న కాలుష్యాన్ని పీల్చే స్మాగ్ టవర్లు.. ఆ తర్వాత స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి. మరోవైపు ట్రీ ప్లాంటేషన్ ( Tree plantation ) విధానానికి కూడా ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ఆమోదం తెలిపింది. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఒకవేళ చెట్లను నరికితే అందులో కనీసం 80 శాతం వృక్షాలను మరోచోట నాటేలా ఢిల్లీ ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 80 శాతం చెట్లను మరోచోట నాటితేనే .. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏజెన్సీకి పేమెంట్ ఇస్తామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఏజెన్సీలను ఏర్పాటు చేసేందుకు ప్యానల్‌ను నియమిస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. Also read: Rishikesh: అమెరికా మహిళపై అత్యాచారం