Delhi on Yello Alert: దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు అత్యధిక ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటికే క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించింది. ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ విధించింది. కోవిడ్ మహమ్మారి ముప్పుని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ (Yellow Alert in Delhi) జారీ చేసినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఎల్లో అలర్ట్ జారీ చేశామని..పూర్తి స్థాయిలో విధి విధానాలు, ఆంక్షల గురించి త్వరలో వెల్లడిస్తామన్నారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం కంటే ఎక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు పదిరెట్లు సిద్ధంగా ఉందన్నారు.
కోవిడ్ 19 కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని..ఆక్సిజన్ సమస్యలు, వెంటిలేటర్ పరిస్థితులు లేవని అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) చెప్పారు. నిన్న ఒక్కరోజులో ఢిల్లీలో 331 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 9 తరువాత ఇదే అత్యధికం. పరిస్థితుల్ని పూర్తిగా ఎదుర్కొనేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సన్నద్ధంగా ఉంది. ఎల్లో ఎలర్ట్ ప్రకారం స్కూళ్ల మూసివేత, నైట్‌కర్ఫ్యూ, ,ప్రత్యామ్నాయ రోజుల్లో షాపులు తెరవడం, మెట్రో రైళ్లలో సీటింగ్ సామర్ధ్యం తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను నియంత్రించడం వంటివి ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీలో రాత్రి 11 గంటల్నించి ఉదగయం 5 గంటల వరకూ నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది. ఢిల్లీలో థర్డ్‌వేవ్‌ను గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంచనా వేస్తోంది.
ఎల్లో అలర్ట్ అంటే ఏమిటి (What is Yellow Alert)
నిత్యావసర వస్తువులు కాకుండా ఇతర వాణిజ్య సముదాయాలు, షాపులపై ఎల్లో ఆంక్షలు విధిస్తారు. షాపింగ్ మాల్స్ యాడ్ ఈవెన్ ఫార్ములా ప్రకారం తెర్చుకుంటాయి. అది కూడా ఉదయం 10 గంటల్నించి రాత్రి 8 గంటల వరకు మాత్రమే. వారానికొక మార్కెట్ 50 శాతం షాపులు తెర్చుకునేలా అనుమతులుంటాయి. రెస్టారెంట్లు కూడా ఉదయం 8 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ 50 శాతం పరిమితితో తెర్చుకోవచ్చు. అటు బార్లకు కూడా ఇదే పరిస్థితి. మద్యాహ్నం 12 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ అనుమతి ఉంటుంది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ అనుమతించరు. ఇదే పరిమితి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పండుగలకు ఉంటుంది.
ఢిల్లీ మెట్రో 50 శాతం సామర్ధ్యంతో నడుస్తాయి. అటు ఆటో రిక్షాలకు కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే అనుమతి ఉంటుంది. బస్సులు కూడా 50 శాతం సామర్ద్యంతో నడుస్తాయి. అయితే ఎల్లో ఎలర్ట్ ఉన్నప్పుడు ధియేటర్లు, బ్యాంక్వెట్ హాల్స్, స్పాలు, జిమ్స్, అవుట్ డోర్ యోగా , అమ్యూజ్‌మెంట్ పార్కులు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్, స్కూళ్లు, కళాశాలకు, విద్యాలయాలు తెర్చుకోవు. ప్రైవేటు ఆఫీసులు కూడా 50 శాతం సామర్ధ్యంతోనే పని చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
Also read: Omicron Variant: వేగం పుంజుకున్న ఒమిక్రాన్, ఆందోళన రేపుతున్న సెకండరీ కాంటాక్ట్ సంక్రమణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook