వ్యయాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఆర్మీ బేస్ వర్క్ షాప్(ఏబిడబ్ల్యూ)లను నిర్వహించుకొనేందుకు రక్షణ శాఖ ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఏబిడబ్ల్యూలను ప్రైవేటు కంపెనీలు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాల్లో నడపనున్నాయి. ఈ కంపెనీలకు కావలసిన భూమి, పరికరాలు తదితర వనరులను కేంద్రమే సమకూర్చనుంది. నిపుణుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది.
బాంబులు, క్షిపణల కొనుగోలుకు ఆమోదం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారంనాడు రెండు కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించారు. మొట్టమొదటి ప్రతిపాదన రూ.1,254 కోట్ల వ్యయంతో 240 బాంబులను రష్యాకు చెందిన ఎం/ఎస్ జెఎస్సి రోసోన్బర్న్ ఎక్సపోర్ట్స్ కంపెనీ నుండి కొనుగోలు చేస్తారు. వీటిని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఉపయోగిస్తుంది.
రెండవ ప్రతిపాదనలో, 131 బార్క్ క్షిపణులను మరియు సంబంధిత సామగ్రిని ఎం/ఎస్ రెఫియెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇజ్రాయిల్ నుండి రూ.460 కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తారు. ఈ క్షిపణులను నౌకారంగం ఉపయోగిస్తుంది.