Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు. అత్యంత రద్దీ గల ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఈక్రమంలోనే అగ్నిపథ్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. తన నివాసంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో మంతనాలు జరిపారు.
ఇందులో సైనిక విభాగాల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే గైర్హజరైయ్యారు. వ్యక్తి కారణాలతో ఆయన ఢిల్లీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ పథకం అమలు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలపై చర్చలు జరిపారు. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అగ్నిపథ్ జ్వాలలు కొనసాగుతున్నాయి.
ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు , సీఏపీఎఫ్‌అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీటితోపాటు బలగాల్లో చేరేందుకు గరిష్ఠ వయోపరిమితిలోనూ మార్పులు చేసిది. ఐనా ఆందోళనలు సర్ధుమణిగేలా కనిపించడం లేదు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Also read:Agnipath Riots: అగ్నిపథ్ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook