CTET 2020 Exam on january 31: న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తేదీని సీబీఎస్ఈ (CBSE) తోపాటు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అయితే ఈ పరీక్షను వచ్చే ఏడాది (2021) జనవరి 31న నిర్వహించనున్నట్లు (CTET Exam Date) బుధవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ (Ramesh Pokhriyal) ట్విట్ ద్వారా వెల్లడించారు.
कोविड-19 को दृष्टिगत रखते हुए @cbseindia29 द्वारा आयोजित प्रतिष्ठित सीटीईटी परीक्षा अब 31.01.2021 को आयोजित की जाएगी। अभ्यर्थियों की सुविधा के लिए 23 और शहरों में नए परीक्षा केंद्र बनाए गए हैं तथा अभ्यर्थियों को परीक्षा केंद्र के स्थान के विकल्प में सुधार का अवसर भी दिया गया है। pic.twitter.com/n1AdPPxzOF
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) November 4, 2020
అయితే కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం మరికొన్ని పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు పోఖ్రియాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలతోపాటు మరో 23 పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు వారి సౌలభ్యం మేరకు.. పరీక్ష కేంద్రాల మార్చుకునే వారికోసం మరో అవకాశం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు
పరీక్షా కేంద్రాలు మార్చుకోవాలనుకున్న అభ్యర్థులు నవంబరు 7 నుంచి 16 వరకు అవకాశం కల్పిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థులు www.ctet.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చని వెల్లడించింది. అయితే ఈ సీటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 135 నగరాల్లో జరగనుంది. Also read: Shivraj Singh Chouhan: మత మార్పిడికి వ్యతిరేకంగా ఎంపీలో చట్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe