CRPF Medical Officer Recruitment 2021: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Specialist Medical Officers) పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నోటిఫికేషన్ జారీచేసింది. సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అస్సాంలోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్‌కి రూ. 85,000 నెలసరి వేతనం అందించనుండటం. దీంతో ఏకకాలంలో వైద్య వృత్తికి న్యాయం చేస్తూనే, సీఆర్పీఎఫ్ కోసం సేవలు అందించడంతో పాటు తగిన పారితోషికం అందుకోవచ్చని భావించే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌పై crpf.gov.in లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 14న ఉదయం 9 గంటల నుంచి వాక్-ఇన్-ఇంటర్వ్యూ (walk-in-interview) పద్దతిలో రిక్రూట్‌మెంట్ జరగనుంది.
ఇంటర్వ్యూ జరిగే వేదిక: కాంపోజిట్ హాస్పిటల్, సీఆర్పీఎఫ్, జీసీ క్యాంపస్, ఉదర్‌బంద్, దయాపూర్, సిల్చార్ (అస్సాం). Composite Hospital, CRPF, GC Campus, Udarband, Dayapur, Silchar (Assam).
Also read : Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే
అనస్థీషియా, పాథాలజీ, మెడిసిన్, రేడియాలజీ, నేత్ర విభాగాల్లో (Anaesthesia, Pathology, Medicine, Radiology and Eye) మొత్తం ఐదు ఖాళీ స్థానాలకు గాను ఈ వాకిన్ ఇంటర్వ్యూ జరగనుంది. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ పేరిట జరగనునన్న ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.85,000 శాలరీ అందనుంది.
వయో పరిమితి | Age Eligibility:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఇంటర్వ్యూకి హాజరయ్యే నాటికి 70 ఏళ్ల వయస్సులోపు అయ్యుండాలి.
అర్హతలు | Qualifications:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత విభాగంలో పోస్ట్-గ్రాడ్యూయేట్ డిగ్రీ లేదా డిప్లొమా (Post-graduate degree / diploma) చేసి ఉండాలి. డిగ్రీ హోల్డర్స్‌కి ఏడాదిన్నర, డిప్లొమా హోల్డర్స్‌కి రెండున్నరేళ్ల అనుభవం తప్పనిసరి.
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్‌గా ఎంపికైన వారికి ముందుగా మూడేళ్లపాటు కాంట్రాక్ట్ పద్దతిలో అపాయింట్‌మెంట్ అందనుంది. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి చొప్పున మొత్తం రెండేళ్లపాటు సర్వీసును కొనసాగించే అవకాశం ఉంటుంది.
Also read : LPG cylinder price: వరుసగా రూ. 125 పెరిగిన తర్వాత తొలిసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
ఇంటర్వ్యూకి హాజరు కావాలనుకునే అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్స్‌కి సంబంధించిన ఒరిజినల్, ఫోటోకాపీలను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుందని సీఆర్పీఎఫ్ తమ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే ఏ విభాగంలో పోస్టుకైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ వివరాలను తెలియజేస్తూ తెల్ల కాగితంపై రాసుకున్న దరఖాస్తును, ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్‌ను కూడా వెంట తీసుకురావాల్సిందిగా CRPF తెలిపింది. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయిన అనంతరం ఈ ఇంటర్వ్యూ ఉండనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook