India: ఒక్కరోజులో 52వేల కరోనా కేసులు

CoronaVirus Positive Cases In India | భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 775 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Jul 30, 2020, 10:33 AM IST
India: ఒక్కరోజులో 52వేల కరోనా కేసులు

భారత్‌లో కోవిడ్19 (COVID-19) తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఓవైపు కరోనా రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 52వేలకు పైగా కరోనా కేసులు (COVID19 cases in India)న నిర్ధారించారు. బుధవారం ఒక్కరోజే 52,123 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసులలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం. వీటితో కలిపి భారత్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 15,83,792కు చేరింది. Rhea Chakraborty సుశాంత్‌ను వేధించింది: అంకితా లోఖాండే

నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 775 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాలు 34,968కు చేరుకున్నాయి. అయితే మొత్తం కేసులకుగానూ 10లక్షలకు పైగా బాధితులు కరోనా మహమ్మారిని జయించడం గమనార్హం. భారత్‌లో చికిత్స అనంతరం 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 5,28,242 యాక్టివ్ కేసులున్నాయి. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 

కరోనా బాధితుల రికవరీ భేష్...
దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ప్రస్తుతం 5 లక్షల పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా పేషెంట్ల రికవరీ రేటు (COVID19 Recoveries In India) 64.51శాతం ఉండగా, మరణాల రేటు 2.23శాతం ఉన్నట్లు వెల్లడించింది. అయితే కరోనా బాధితుల రికవరీ రేటు క్రమక్రమంగా పెరుగుతుండటంపై హర్షం వ్యక్తం చేసింది. Favivir: రూ.59కే కరోనా ట్యాబ్లెట్.. 

పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్ 

Trending News