Covid-19: భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,425 కోవిడ్19(Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (India's COVID19 case tally crosses 11 lakh mark)11లక్షలు దాటిపోయింది.

Last Updated : Jul 20, 2020, 10:46 AM IST
Covid-19: భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు

India Corona Positive Cases | భారత్‌లో కరోనా కేసుల తీవ్రత అధికమవుతోంది. ముఖ్యంగా జులై నెలలో భారీగా పాజిటివ్ నమోదవుతున్నాయి. మరణాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,425 కోవిడ్19(Covid-19) పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏకంగా 681 మంది మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యధికం. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య (India COVID19 Cases) 11,18,043కి చేరింది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

మరోవైపు కరోనా మరణాల సంఖ్య 27 దాటిపోయింది. తాజాగా నమోదైన సంఖ్యతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 27,497 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు జులై 20న ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కేసులకుగానూ 7,00,087 డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 3,90,459 యాక్టివ్ కేసులున్నాయి. AP: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

దేశంలో ఇప్పటివరకూ 1,40,47,908 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. అందులో జులై 19న ఒక్కరోజే 2,56,039 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

కాగా, దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై తెలుగు రాష్ట్రాలతో మరికొందరు సీఎంలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితిని, కోవిడ్19 మహమ్మారిపై చేపట్టిన చర్యలను సీఎంలను అడిగి తెలుసుకున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News