Paracetamol not recommended : వ్యాక్సినేషన్‌ తర్వాత ఆ ట్యాబ్లెట్ అస్సలు వాడొద్దు..

Covid vaccination, paracetamol is not recommended : 15-18 ఏళ్ల వయస్సు వారికి కొనసాగుతోన్న కోవిడ్ వ్యాక్సినేషన్. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వద్దని వైద్యుల సూచన. రెండు రోజుల పాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు సాధారణమేనని తెలిపిన వైద్య నిపుణులు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 08:20 PM IST
  • 15-18 ఏళ్ల వయస్సు వారికి కొనసాగుతోన్న కోవిడ్ వ్యాక్సినేషన్
  • పారాసెటమాల్ ట్యాబ్లెట్ వద్దని వైద్య నిపుణుల సూచన
  • కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిక
Paracetamol not recommended : వ్యాక్సినేషన్‌ తర్వాత ఆ ట్యాబ్లెట్ అస్సలు వాడొద్దు..

Covid vaccination for 15-18 year old, paracetamol is not recommended for teenagers warn experts : దేశంలో ప్రస్తుతం 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. అయితే వీరికి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు. డాక్టర్స్‌ను సంప్రదించకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవద్దని సూచించారు. కొన్ని వ్యాక్సిన్‌ సెంటర్స్‌లలో 500 ఎంజీ పారాసెటమాల్ (paracetamol) ట్యాబ్లెట్ తీసుకోవాలని సూచిస్తున్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో వైద్య నిపుణులు ఈ సూచన చేశారు.

వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి ఎలా మారుతుందో తెలియదనందువల్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదంటే తర్వాత గానీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవడానికి రెకమెండ్ చేయట్లేదని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక రెండు రోజుల పాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇవన్నీ సాధారణమేనని చెప్పుకొచ్చారు వైద్య నిపుణులు.అయితే అవన్నీ కూడా ఎలాంటి మెడిసిన్‌ తీసుకోకుండానే వాటంతటకు అవే తగ్గిపోతాయని తెలిపారు. ఒక వేళ ఫీవర్ (Fever) ఎక్కువగా ఉంటే డాక్టర్లను సంప్రదించాలని, వారు సూచించిన ట్యాబ్లెట్స్ (Tablets) తీసుకోవాలని కోరారు. 

పిల్లలు పారాసెటమాల్ తీసుకోవడం వల్ల హెపటోటాక్సిసిటీకి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు వైద్య నిపుణులు. హెపటోటాక్సిసిటీ అంటే ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలిగే పరిస్థితి ఏర్పడడం అని పేర్కొన్నారు. 15-18 ఏళ్ల వయస్సు వారు వ్యాక్సినేషన్ (Covid vaccination for 15-18 year old) తీసుకున్నాక ఒకవేళ ఫీవర్ వస్తే మెఫెనామిక్ యాసిడ్, మెఫ్తల్ సిరప్ ఇవ్వాలని సూచించారు. ఇక 18 సంవత్సరాలు పైబడిన వారు పారాసెటమాల్ తీసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

Also Read : AP Corona cases: ఏపీలో భారీగా పెరిగన కరోనా కేసులు- ఒక్క రోజులో 840 మందికి పాజిటివ్​

ఇక దేశంలో 15-18 సంవత్సరాల వారికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే కొవాగ్జిన్‌ (Covaxin) వ్యాక్సిన్ ఇచ్చాక పారాసెటమాల్‌ ట్యాబ్లెట్స్ గానీ, మరి ఏ ఇతర ట్యాబ్లెట్స్ గానీ వేసుకోవాలని తాము చెప్పలేదని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. తాము ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పామన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి సూచనలు తాము చేయలేదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ (Omicron) హడలెత్తిస్తోంది.

Also Read : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు! క్వారంటైన్‌ తప్పనిసరి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News