India Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 1,49,394 కొవిడ్ కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. గత 24 గంటల్లో..వైరస్ తో 1,072 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 5,00,055కి చేరింది.
కరోనా నుంచి 2,46,674 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 4,00,17,088 మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా 14,35,569 కొవిడ్ యాక్టివ్ (Covid-19 Active Cases in India) కేసులున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 9.27శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.20 శాతంగా ఉండగా... రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 168.47 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
India reports 1,49,394 fresh COVID cases (13% lower than yesterday), 2,46,674 recoveries, and 1072 deaths in the last 24 hours
Active cases: 14,35,569
Death toll: 5,00,055
Daily positivity rate: 9.27%Total vaccination: 168.47 crore pic.twitter.com/lOiJUwbueG
— ANI (@ANI) February 4, 2022
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 30,65,159 మందికి (World Wide Corona Cases) కరోనా సోకింది. వైరస్ తో 11,310 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 38,82,54,530 కు చేరగా.. మరణాల సంఖ్య 57,30,459 కు పెరిగింది.
Also Read: Gate Exam 2022 Update: 'గేట్' పరీక్ష వాయిదా వేయడం కుదరదు... తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook