Covaxin: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి

Covaxin: తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ చిక్కుల్లో పడింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల వాలంటీర్ మృతి చెందడంతో..అత్యవసర వినియోగపు అనుమతిపై ప్రశ్నలు రేగుతున్నాయి.

Last Updated : Jan 10, 2021, 12:57 PM IST
  • భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ తీసుకున్న వాలంటీర్ మృతి
  • భోపాల్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఫేజ్ 3 ట్రయల్స్ లో డిసెంబర్ 12న వ్యాక్సినేషన్
  • డిసెంబర్ 21న మృతి..అత్యవసర వినియోగపు అనుమతిపై విమర్శలు
Covaxin: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి

Covaxin: తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ చిక్కుల్లో పడింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల వాలంటీర్ మృతి చెందడంతో..అత్యవసర వినియోగపు అనుమతిపై ప్రశ్నలు రేగుతున్నాయి.

భారతదేశ తొలి స్వదేశీ వ్యాక్సిన్..హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech Company ) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) కు డీసీజీఐ ( DCGI ) అత్యవసర వినియోగపు అనుమతి మంజూరు చేసింది. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతి ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కోవ్యాగ్జిన్ తీసుకున్న వాలంటీర్ మరణించడంతో విమర్శల ధాటి పెరిగింది.

భోపాల్ ( Bhopal ) లోని పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ లో డిసెంబర్ 12వ తేదీన కోవ్యాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ ( Phase 3 human trials ) లో భాగంగా గిరిజన కూలీ 42 ఏళ్ల దీపక్ మర్వాయికి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న 9 రోజులకు అంటే డిసెంబర్ 21న మృతి చెందాడు. కోవ్యాగ్జిన్ ( Covaxin ) తీసుకుని ఇంటికి తిరిగొచ్చిన తరువాత దీపక్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని..ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 21వ తేదీన ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడని కుటుంబసభ్యులు చెప్పారు. 

Also read: Balakot airstrikes: ఆ దాడుల్లో 3 వందలమంది మరణించారని ధృవీకరణ

అయితే మధ్యప్రదేశ్ ( Madhya pradesh ) మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాత్రం దీపక్ మర్వాయికు విషప్రయోగం జరిగినట్టు అనుమానాలున్నాయన్నారు.  అటు ఈ వ్యవహారంపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. ఫేజ్-3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నఏడు రోజుల వరకూ ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కన్పించలేదని..ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. 9 రోజుల తరువాత మరణించాడంటే..వ్యాక్సిన్ కారణం కాదని కంపెనీ చెబుతోంది. 

మూడో దశ ప్రయోగాల డేటా పూర్తిగా రాకుండానే అత్యవసర వినియోగపు అనుమతి ఇచ్చినందుకు ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడం కలకలం రేపుతోంది.

Also read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం

Trending News