కరోనా వైరస్ 11 రకాలు..!!

'కరోనా వైరస్' 11 రకాలు. నమ్మశక్యం కాకున్నప్పటికీ మీరు చదివింది నిజమే..!! కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మొత్తంగా 10 రకాలుగా  మారిపోయిందని భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. 

Last Updated : Apr 29, 2020, 12:45 PM IST
కరోనా వైరస్ 11 రకాలు..!!

'కరోనా వైరస్' 11 రకాలు. నమ్మశక్యం కాకున్నప్పటికీ మీరు చదివింది నిజమే..!! కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మొత్తంగా 10 రకాలుగా  మారిపోయిందని భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. 

చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టిల్లు. అక్కడ పుట్టిన  వైరస్ 'O'రకానికి చెందినది. ఆ తర్వాత మరో 10 రకాలుగా కరోనా మహమ్మారి రూపాంతరం చెందిందని భారత పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్ 2019  నుంచి 2020 ఏప్రిల్ 6 వరకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తంగా 3 వేల 600 కరోనా వైరస్ RNAలపై పరిశోధనలు జరిపినట్లు వెల్లడించారు. 

రూపాంతరం చెందిన 10 రకాల్లో .. అన్నింటి కంటే A2a వైరస్ చాలా ప్రమాదకరమని వెల్లడించారు. ఇది ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ సంఖ్యలో త్వరగా దూసుకెళ్లే సామర్థ్యం  కలిగి  ఉన్నట్లు గుర్తించారు. అంతే కాదు ఇదే వైరస్ .. త్వరిత గతంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేందుకు కారణమైందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వేగంగా తన రూపాన్ని మార్చుకోవడం వల్ల వ్యాక్సిన్ తయారు చేసే పరిశోధకులకు వ్యాక్సిన్ తయారీ సాధ్యం కావడం లేదని తెలిపారు. A2a వైరస్‌ను పరిశోధకలు సార్స్ -cov2గా అభివర్ణించడం మరో విశేషం.

చైనా తర్వాత మిగతా దేశాలకు అతి కొద్ది కాలంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పరిశోధకులకు ఓ అనుమానం వచ్చింది. వైరస్ త్వరగా రూపాంతరం చెందుతుందేమోనని అనుమానించారు. చివరకు వారు అనుకున్నదే నిజమైంది. కరోనా వైరస్ 'O' నుంచి A2, A2a, A3, B, B1.. ఇలా రూపాంతరం చెందింది. ఇలా 11 రకాలుగా మారిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News