Covid19 Cases in India: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు!

Corona Virus Alert: కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 04:54 PM IST
Covid19 Cases in India: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు!

Coronavirus Alert and New Cases in India: కరోనా వైరస్ కేసులు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. కరోనా సంక్రమణ రేటు కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జూన్ నాటికి ఈ పరిస్థితి పీక్స్‌కు చేరనుందనే హెచ్చరికలు ఇప్పటికే ఆందోళన కల్గిస్తున్నాయి. అసలేం జరగనుంది, నిపుణుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం..

కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కొత్త కేసులు 6,155 నమోదయ్యాయి. దీంతో పాటు కరోనా యాక్టివ్ కేసులు 31,194కు చేరుకున్నాయి. ఇక గత 24 గంటల్లో 11 మంది కరోనా కారణంగా మరణించారు. అంతకుముందు రోజు 14 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఢిల్లీలో అత్యధికంగా 535 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సంక్రమణ రేటు 23.05కు చేరుకుంది. 

కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణం కరోనా కొత్త వేరియంట్‌గా తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ నిపుణులు గుడ్ న్యూస్ విన్పిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే కరోనా కొత్త వేరియంట్ సోకిన రోగులను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి తక్కువే ఉందంటున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అయితే కరోనా కేసులు ఎప్పటి నుంచి తగ్గుముఖం పడతాయనేది తెలుసుకుందాం.

Also Read: India Covid-19 Update: దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 5 వేలకుపైగా కేసులు..

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ XBB.1.16 అత్యంత వేగంగా సంక్రమిస్తోంది. అందుకే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఆందోళన వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. రానున్న 2-3 వారల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టవచ్చని అంచనా. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి పట్ల చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకే కేసుల సంఖ్య పెరుగుతోంది. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదంటున్నారు.

కరోనావైరస్ సంక్రమణ వేగంగా ఉన్నా సరే ప్రజలకు పెద్దగా సమస్యలు ఎదురుకావడం లేదు. కొంతమందైతే కనీస పరీక్షలు కూడా చేయించుకోవడం లేదు. లేకపోతే కరోనా కేసుల సంఖ్య ఈపాటికే చాలా ఎక్కువ ఉండేది. మరోవైపు కరోనా సోకినవాళ్లలో ఎవరికీ ఆసుపత్రులో చేర్పించాల్సిన పరిస్థితి రాలేదు. 

అయితే ముందు జాగ్రత్త చర్యలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ట్రాక్, టెస్ట్, ట్రీట్, వ్యాక్సినేషన్ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలంటున్నారు. ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ మాత్రం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.

Also Read: Cholesterol Signs: మీలో ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవాల్సిందే, కొలెస్ట్రాల్ సంకేతాలివి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News