/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో (Corona crisis)కొట్టుమిట్టాడుతోన్న ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కోవాలో మదనపడుతున్నాయి. ఓ వైపు కరోనా మరణాల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. ఇరాన్, ఇటలీలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రకంగా భారత్ లో ఇప్పటివరకు 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తాజాగా మహారాష్ట్రలోని మరో నాలుగు నగరాల్లో సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ను ఈ ఉదయం 11 గంటల నుండి మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన నగరాలైన పూణే, నవీ ముంబై, నాగ్‌పూర్, పింప్రి చించ్వాడ్ లో అన్నీ రకాల ఏర్పాట్లు చేశామని, తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ, కేరళ, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయని పేర్కొన్నారు. అయితే 10 వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయని అన్నారు. 

Read Also: కరోనా దెబ్బకు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు

వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా కంపెనీలు, ఉద్యోగులను ఇంటి నుండే పని చేయడానికి అనుమతించాలని సీఎం ఉద్ధవ్ థాకరే సూచించారు. మార్చి 29న జరగాల్సిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. బహుళ సంఖ్యల్లో హాజరయ్యే వేదిక కావడంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. 

Also Read: IPL 2020 suspended: ఐపిఎల్ 2020 వాయిదా 

కరోనావైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఇప్పటికే ఒక మహమ్మారిగా ప్రకటించింది. పర్యాటకుల వీసాలను నిలిపివేయడంతో పాటు, వివిధ దేశాల నుండి తిరిగి వచ్చే భారతీయులు ముఖ్యంగా చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ నుండి వచ్చే వారిని కనీసం 14 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Corona Virus Updates: Schools, colleges, malls, cinema halls shut in several states
News Source: 
Home Title: 

Corona Virus Updates: ఐదు రాష్ట్రాల్లో హై అలెర్ట్..

Corona Virus Updates: ఐదు రాష్ట్రాల్లో హై అలెర్ట్..
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Corona Virus Updates: ఐదు రాష్ట్రాల్లో హై అలెర్ట్..
Publish Later: 
No
Publish At: 
Friday, March 13, 2020 - 20:07