Vaccine Dry Run: దేశమంతటా ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రై రన్

కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా డ్రై రన్ ప్రక్రియ జరుగుతోంది. వ్యాక్సినేషన్ సందర్బంగా తలెత్తే అవాంతరాల్ని ముందస్తుగా ఎదుర్కొనే క్రమంలో డ్రై రన్ ప్రక్రియ కీలకమైంది.

Last Updated : Jan 2, 2021, 02:17 PM IST
Vaccine Dry Run: దేశమంతటా ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రై రన్

కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా డ్రై రన్ ప్రక్రియ జరుగుతోంది. వ్యాక్సినేషన్ సందర్బంగా తలెత్తే అవాంతరాల్ని ముందస్తుగా ఎదుర్కొనే క్రమంలో డ్రై రన్ ప్రక్రియ కీలకమైంది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) సమయం సమీపిస్తోంది. బహుశా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ జరిగే అవకాశముంది. ఈ నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తల కోసం చేపట్టే కీలకమైన డ్రై రన్ ( Vaccine dry run ) ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో భాగంగా వైద్యులు, నర్శులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతా బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.

రెండో దశలో కోవిడ్ యాప్ ద్వారా సాధారణ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఈ సందర్బంగా ఢిల్లీ జీటీబీ ఆసుపత్రిలో జరుగుతున్న డ్రై రన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ( Union minister Harshvardhan ) పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని...ఎలాంటి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందన్నారు. 

డ్రై రన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) , తెలంగాణ ( Telangana ) రాష్ట్రాల్లో డ్రై రన్ మొదలైంది. ఏపీ 13 జిల్లాల్లోని 39 కేంద్రాల్లో డ్రై రన్ ప్రక్రియ సాగుతోంది. ప్రతి జిల్లాలో మూడేసి ఆసుపత్రుల్లో డ్రై రన్ జరుగుతోంది. ఒక్కో సెంటర్‌లో 25 మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. అటు హైదరాబాద్, మహబాబ్‌నగర్ జిల్లాల్లో  సైతం డ్రై రన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

Also read: Lowest temperature: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత..వణికిస్తున్న చలిగాలులు

Trending News