India Corona Positive Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా, వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కోవిడ్19 కేసులు తగ్గుతున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలించాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలను కుదించడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. బుధవారం నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 కోట్లు దాటడం తెలిసిందే.
ఇండియాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,00,82,778 (3 కోట్ల 82 వేల 778)కు చేరుకుంది. లాక్డౌన్ సడలింపులతో కోవిడ్19 కేసులు అధికంగా నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న ఒక్కరోజు 1,321 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఇండియాలో ఇప్పటివరకూ 3,91,981 (3 లక్షల 91 వేల 981) మంది కరోనాతో చనిపోయారు. భారత్‌లో మొత్తం 30,16,26,028 డోసుల కరోనా వ్యాక్సినేషన్ (COVID-19 Vaccine) ప్రక్రియ పూర్తయింది.
Also Read: Telangana COVID-19 updates: తెలంగాణ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్
జూన్ 23న (బుధవారం నాడు) దేశంలో మరో 68,885 మంది కరోనా (CoronaVirus)ను జయించారు. ఇప్పటివరకూ 2,90,63,740 (2 కోట్ల 90 లక్షల 63 వేల 740)కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు మరోసారి దిగొచ్చాయి. ప్రస్తుతం 6,427,057 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. భారత్‌లో కరోనా రికవరీ రేటు బుధవారం నాటికి 96.61 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.04 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Also Read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 కారకాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook