Mallikarjun Kharge: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్‌

Mallikarjun Kharge:  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరోనా బారినపడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 12:43 PM IST
  • మల్లికార్జున ఖర్గేకు కరోనా
  • స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడి
Mallikarjun Kharge:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్‌

Mallikarjun Kharge Corona: దేశంలో కరోనా (Covid-19) కోరలు చాస్తోంది. సామాన్యులు నుంచి సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఖర్గే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన రెండు డోసులు తీసుకున్నారని, అయితే ప్రికాషన్‌ డోసు తీసుకునేందుకు ఇంకా అర్హులు కాలేదని పేర్కొంది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గేలో పాల్గొన్నారు. 

మరోవైపు ఈ ఇదే పాదయాత్రలో పాల్గొన్న మరో కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీకి కూడా కరోనా బారిన పడ్డారు. గతంలో ఖర్గే రైల్వే మంత్రిగా, కార్మిక ఉపాధి మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ((Nitin Gadkari), బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్​ (Amarinder Singh) సహా పలువురికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ...ఏపీ మంత్రి కొడాలి నాని ((Kodali Nani), తెదేపా నేతలు వంగవీటి రాధా, పయ్యావుల కేశవ్, తెలంగాణ మంత్రి జగదీశ్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలకు కరోనా సోకింది. 

Also Read: Amarinder Singh Corona: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

మరోవైపు దేశంలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,47,417 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News