Indian vaccine: వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతిపై కాంగ్రెస్ అభ్యంతరం

Indian vaccine: కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న దశలో అనుమతి ఎలా ఇవ్వడంపై కాంగ్రెస్ వ్యతిరేకత తెలిపింది.

Last Updated : Jan 3, 2021, 09:04 PM IST
Indian vaccine: వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతిపై కాంగ్రెస్ అభ్యంతరం

Indian vaccine: కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న దశలో అనుమతి ఎలా ఇవ్వడంపై కాంగ్రెస్ వ్యతిరేకత తెలిపింది.

తొలి దేశీయ వ్యాక్సిన్ ( First indian vaccine ), హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ( Bharat Biotech ) కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ), ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-AstraZeneca ) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ ( Covishield ) లకు డీసీజీఐ అత్యవసర అనుమతిచ్చింది. కోవిషీల్డ్‌ను దేశీయంగా పూణేకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. అయితే డీసీజీఐ ఆమోదంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం ప్రకటించింది. ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో ఆమోదం ఇవ్వడం సరైంది కాదని విమర్శించింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాగ్జిన్ అనుమతిపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరముందని కాంగ్రెస్ ( Congress ) నేత ఆనంద్ శర్మ విమర్శించారు. మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ కూాడా అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ నేతల అభ్యంతరాన్ని బీజేపీ ఖండించింది.

డీసీజీఐ ( DCGI ) ఆమోదించిన రెండు వ్యాక్సిన్‌ల పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషంగా లేకపోవడం విచారకరమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ( Union minister Hardeep singh ) విమర్శించారు. వ్యాక్సిన్ ఆమోదంపై రాజకీయం చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో రానుందని తెలిపారు. 

Also read: Indian railways: ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్ నిర్మించిన భారతీయ రైల్వే

Trending News