అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికలతో లింక్ చేస్తోంది : మోదీ

గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విరుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్యలోని రామ మందిరాన్ని 2019 ఎన్నికలతో ముడిపెట్టాలని భావిస్తోందని అన్నారు.

Last Updated : Dec 8, 2017, 05:29 PM IST
అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికలతో లింక్ చేస్తోంది : మోదీ

ధన్ధుక: గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విరుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్యలోని రామ మందిరాన్ని 2019 ఎన్నికలతో ముడిపెట్టాలని భావిస్తోందని అన్నారు. 

కాంగ్రెస్, ఆ పార్టీ నేత కపిల్ సిబాల్ మంగవారం సుప్రీంకోర్టులో అయోధ్యలోని 'రామమందిరం-బాబ్రీ మసీదు' అంశంపై వాదనలు వినిపించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ బాబ్రీ మసీదు తరుఫున వాదనలు సుప్రీంకోర్టులో వినిపించారు. ఆయన వాదనలు ఒకసారి గమనిస్తే.. తీర్పు 2019 వరకు వాయిదా వేయరా? అన్నట్టు ఉంది. ఎందుకు ఆయన రామమందిరంను ఎన్నిలకతో ముడిపెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు? మీకేమైనా అర్థమైందా?" అంటూ ప్రసంగించారు. విశేషమేమిటంటే బాబ్రీ ఘటన జరిగి సరిగ్గా నేటికి 25 ఏళ్లు గడిచాయి.

Trending News