బెంగళూరు: ఎట్టకేలకు కర్నాటక అసెంబ్లీలో చోటు చేసుకున్న హైడ్రామకు తెరపడింది. విధాన సభలో ఈ రోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంతో విఫలమైంది. కుమారస్వామి సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఈ రోజు స్పీకర్.. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ ను నిర్వహించారు.
మేజిక్ ఫిగర్ కాస్త దూరంలో కుదేల్
ఈ ఓటింగ్ కుమారస్వామి సర్కార్ స్పల్ప తేడాతో విఫలమైంది. సభకు మొత్తం 205 మంది హాజరుకాగా 103 మెజిక్ ఫిగర్ నిర్ణయించారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 99 మాత్రమే పోలయ్యాయి. విజయానికి నాలుగు ఓట్ల తేడాతో కుమారస్వామి సర్కార్ విఫలమైంది. కాగా కుమారస్వామి సర్కార్ కు వ్యతిరేకంగా 105 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎం కుమారస్వామి రాజీనామా !!
కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణలో విఫలమైన నేపథ్యంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. రాజీనామా సమయంలో సీఎం కుమారస్వామి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. విశ్వాస పరీక్ష ఫలితాన్ని బట్టి సీఎం కుమారస్వామి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మే 23, 2018న కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పద్నాలుగు నెలల పాలన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.
గవర్నర్ ఏం చేసేను ?
విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ -జేడీఎస్ సర్కార్ కుప్పకూలడం..ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వం ఏర్పటు వరకు ఆపధార్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామికి గవర్నర్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మెజార్టీ నిరూపించుకు బీజేపీ సర్కార్ కు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.