Supreme Court: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..ఆమెకే అవకాశాలు ఎక్కువ!

Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2021, 01:12 PM IST
  • కేంద్రానికి 9మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు
  • సీజీఐ రేసులో ముగ్గురు మహిళలు
  • జస్టిస్‌ బి.వి. నాగరత్నకే అవకాశాలు ఎక్కువ
Supreme Court: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..ఆమెకే అవకాశాలు ఎక్కువ!

Supreme Court: సుప్రీంకోర్టులో  ప్రధాన న్యాయమూర్తి  పదవిని మహిళ చేపట్టే సమయం ఆసన్నమైనట్లుంది. ఎందుకంటే ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలిజీయం సిఫార్సు చేసింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారే జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బేల త్రివేది. 

వీరిలో జస్టిస్‌ బి.వి. నాగరత్న(Justice BV Nagarathna) పేరును కేంద్రం ఆమోదిస్తే గనుక 2027లో ఆమె భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి(first woman Chief Justice of India)గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. తొలి మహిళా సీజేఐగా దేశ న్యాయ చరిత్రలో నిలిచిపోతారు. ప్రస్తుతం ఈమె కర్ణాటక హైకోర్టు(Karnataka Highcourt) జడ్డిగా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి ఈఎస్‌ వెంకటరామయ్య(ES Venkataramaiah) కూడా  1989 జూన్‌ నుంచి 1989 డిసెంబరు వరకు సుప్రీంకోర్టు సీజేఐగా పనిచేశారు.

Also Read: Judges Security: న్యాయమూర్తుల భద్రత కేంద్రమే చేపట్టాలి

‘'మహిళా సీజేఐని నియమించాల్సిన సమయం వచ్చేసింది'’అని గతంలో మాజీ సీజీఐ ఎస్ఐ బోబ్డే(Former CJI SI Bobde) చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ(NV Ramana) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం(Collegium) తదుపరి చీఫ్‌ జస్టిస్‌ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి(Central Government) సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ(PS Narsimha) పేరు కూడా కొలీజయం(Collegium) జాబితాలో ఉంది. నాగరత్న(Justice BV Nagarathna), పీఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ(Justice Fathima Beevi) సుప్రీంకోర్టు జడ్జ్‌గా 1989లో నియమితులయ్యారు. ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయమూర్తులుగా వ్యవహరించారు. ప్రస్తుతం 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో.. జస్టిస్ ఇందిరా బెనర్జీ(Justice Indira Banerjee) ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లు ఇవే..

జస్టిస్‌ హిమా కోహ్లి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ బి.వి. నాగరత్న : కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ బేలా త్రివేది : గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌ : కేరళ హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా : కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ : గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ జేకే మహేశ్వరి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ సి.టి. రవికుమార్‌ : కేరళ హైకోర్టు న్యాయమూర్తి

సీనియర్‌ న్యాయవాది: పీఎన్‌ నరసింహ

Also Read: న్యాయమూర్తులకు ఆ తరహా రక్షణ సాధ్యం కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News