Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్‌ వాంగ్.. మనకు గండమేనా?

Chinese Spy Ship: భారతీయులు ఇది చాలా కలవరపడే వార్త. భారత్ కు పొరుగు దేశం షాకిచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఝలక్ ఇచ్చింది శ్రీలంక. భారత్ ఎంతగా వారిస్తున్నా చైనా నిఘా నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక అనుమతితో చైనా నిఘా నౌక  యువాన్‌ వాంగ్‌-5 హంబన్‌టొట రేవుకు చేరుకుంది

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 12:46 PM IST
  • భారత్ కు షాకిచ్చిన శ్రీలంక
  • హంబన్‌టొట చేరిన చైనా నిఘా నౌక
  • చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు
Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్‌ వాంగ్.. మనకు గండమేనా?

Chinese Spy Ship: భారతీయులు ఇది చాలా కలవరపడే వార్త. భారత్ కు పొరుగు దేశం షాకిచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో భారత్ కు ఝలక్ ఇచ్చింది శ్రీలంక. భారత్ ఎంతగా వారిస్తున్నా చైనా నిఘా నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక అనుమతితో చైనా నిఘా  నౌక  యువాన్‌ వాంగ్‌-5  హంబన్‌టొట రేవుకు చేరుకుంది. మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చైనా నిఘా నౌక  హంబన్‌టొట రేవుకు చేరుకుందని.. ఆ పోర్టు హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ అధికారికంగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు భారత్ ను కలవరపరుస్తోంది. దేశ భద్రతకు చైనా నుంచి గండం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చైనా యువాన్‌ వాంగ్‌ నౌక 750 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపైనా నిఘా పెట్టగలదు. భారత్ లోని కల్పకం, కూడంకుళం అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. ఏపీ,కేరళ, తమిళనాడులోని ఆరు పోర్టులపై చైనా నిఘా నేత్రం ఉండనుంది. అంతేకాదు యువాన్ వాంగ్ 5 క్షిపణి , అంతరిక్షం, ఉపగ్రహాలను ట్రాకింగ్ చేయగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల సమాచారాన్ని సేకరించగలదు. అందుకే చైనా నిఘా నౌక విషయంలో కేంద్ర సర్కార్ శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళన తెలిపింది. చైనా నౌక ప్రవేశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. భారత్ అభ్యంతరాలతో శ్రీలంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. దీంతో చైనా నౌక శ్రీలంక పరిధిలోకి రావడం లేదనే ప్రచారం జరిగింది.

అయితే శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన చైనా అధికారులు యువాన్ వాంగ్ నౌక ప్రయాణానికి లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హంబన్‌టొటకు రాకుండా ఎందుకు వాయిదా వేయాలని అడిగిన చైనా అధికారులకు లంక అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు. చైనాకు సరైన వివరణ ఇవ్వలేకపోయిన శ్రీలంక.. యువాన్‌ వాంగ్‌-5 నౌక ఎంట్రీకి శనివారం శ్రీలంక అనుమతి ఇచ్చేసింది. అయితే నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు శ్రీలంక అధికారులు చెబుతున్నారు. ఎలాంచి సర్వేలు జరపడానికి వీల్లేదని షరత్ విధించామని తెలిపారు. ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని లంక సర్కార్ ప్రకటించింది.

హంబన్‌టొట అభివృద్ధికి చైనా నుంచి 1.2 బిలియన్‌  డాలర్ల రుణాన్ని తీసుకుంది శ్రీలంక. కాని ఆ రుణాన్ని చెల్లించలేకపోయింది. దీంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు బీజింగ్‌ తీసుకుంది. ఇకపై అక్కడి నుంచే ఆపరేషన్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2014లో కొలంబో పోర్టులో చైనా ఉంచిన జలాంతర్గామి కంటే యువాన్ వాంగ్ 5 నౌక అత్యంత శక్తివంతమైనదని చెబుతున్నారు.

Read Also: Munugode Byelection: రండి బాబు రండి పార్టీలో చేరితే 10 లక్షలు.. మునుగోడు లీడర్లకు బంపర్ ఆఫర్

Read Also: Gun Fire: హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News