ITR filing last date: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

IT returns deadline extended: టాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్. లక్షలాది మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ( Tax payers ) మరింత ఉపశమనం కల్పిస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రిటర్నులను దాఖలు ( IT returns filing dead line extended) చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

Last Updated : Oct 24, 2020, 06:32 PM IST
ITR filing last date: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

IT returns deadline extended: న్యూ ఢిల్లీ: టాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్. లక్షలాది మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ( Tax payers ) మరింత ఉపశమనం కల్పిస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటి రిటర్నులు దాఖలు ( IT returns filing dead line extended) చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం, ఆదాయ-పన్ను రిటర్న్ ఫైలింగ్ గడువును 2021 జనవరి 31 వరకు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. Also read : Pakistani quadcopter: పాక్ ప్రయోగించిన క్వాడ్‌క్యాప్టర్‌ని కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం కోసం కేంద్రం మే నెలలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ( ITR deadline ) చేసే తేదీని జూలై 31 నుండి నవంబర్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

"పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇవ్వడానికి గడువు తేదీని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించినట్టు" సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న వారికి ఐటి రిటర్న్స్ గడువు వచ్చే ఏడాది జనవరి 31వరకు పొడిగించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ఈ ప్రకటనలో స్పష్టంచేసింది. Also read : TS EAMCET 2020 Results: ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు విడుదల

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడానికి వీలుగా ఉండటం కోసమే ఎక్కువ గడువును పొడిగించినట్లు సిబిడిటి వెల్లడించింది. ఐటి రిటర్న్స్ దాఖలు సులభతరం చేయడం కోసం పన్ను చెల్లింపుదారులకు ఐటి రిటర్నులు ఎలా సమర్పించాలో తెలియజేస్తూ ( How to file IT returns ) పలు సూచనలు సైతం జారీచేసింది. Also read : Moratorium: పండుగ కానుక.. లోన్లపై వడ్డీ మాఫీ

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News