Banks Privatization: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలోనే ప్రైవేట్ పరం కానున్నాయి.
మొన్న విశాఖ స్టీల్‌ప్లాంట్..నిన్న ఎల్ఐసీ..నేడు బ్యాంకులు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఒకదానివెంట మరొకటి అమలవుతున్నాయి. గతంలో నిర్ణయించినట్టే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటీకకరణ నిమిత్తం కేంద్ర ఆర్ధికశాఖ కేబినెట్ నుంచి అనుమతి తీసుకోనుంది. దీనికి సంబంధింతి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు చేయనుంది. ఇంకొన్ని నిబంధనల్ని కూడా మార్చే అవకాశాలున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఈ రెండు బ్యాంకుల్లోని విదేశీ పెట్టుబడుల పరిమితి 20 శాతంను తొలగించాలని ప్రతిపాదించనున్నారు. ఈ రెండు బ్యాంకులతో పాటు ఏయే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. మరోవైపు ఈ రెండు బ్యాంకుల ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన స్వచ్ఛంధ పదవీ విరమణ పథకాన్ని ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోట్‌పై చర్చలు పూర్తయ్యాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి.
Also read: Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook