Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల జారీలో మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఇవే ఆ అంశాలు

Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేసేటప్పుడు ఏయే అంశాల్ని పరిగణలో తీసుకుంటామనేది అఫిడవిట్‌లో వివరించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అఫిడవిట్‌లో ఉన్న అంశాలివీ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 13, 2021, 08:46 AM IST
  • కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల జారీకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఏయే అంశాల ఆధారంగా కోవిడ్ డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలనే వివరాలతో అఫిడవిట్
  • సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా ఫిర్యాదుల అంశాన్ని కూడా అఫిడవిట్‌లో పొందుపర్చిన కేంద్రం
Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల జారీలో మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఇవే ఆ అంశాలు

Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేసేటప్పుడు ఏయే అంశాల్ని పరిగణలో తీసుకుంటామనేది అఫిడవిట్‌లో వివరించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అఫిడవిట్‌లో ఉన్న అంశాలివీ.

కరోనా(Corona) కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు నష్టపరిహారం చెల్లించే అంశంలో డెత్ సర్టిఫికేట్ కీలకంగా ఉంటుంది. అయితే కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల(Covid19 Death Certificate) జారీ విషయంలో మార్గదర్శకాలు లేకపోవడంతో ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన మార్గదర్శఖాలతో కూడిన ఉత్తర్వుల్ని జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఏయే అంశాల ఆధారంగా కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేయాలనే వివరాల్ని అఫిడవిట్‌లో ప్రస్తావించింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల నేపధ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో(Covid Death Certificate Guidelines) ఓ విధానాన్ని కేంద్రం రూపొందించింది. కరోనా మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధృవపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్రం(Central Government) తెలిపింది. 

అఫిడవిట్‌లో ప్రస్తావించిన ప్రధాన అంశాలు

ఆర్టీపీసీఆర్ పరీక్ష(RTPCR Test), మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్ 19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్టు ఆసుపత్రిలో వైద్యులు ధృవీకరిస్తేనే కోవిడ్ 19 కేసుగా పరిగణిస్తారు. కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర కారణాలుంటే కోవిడ్ మరణంగా గుర్తించరు. 

ఐసీఎంఆర్(ICMR) అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందినవారిలో 95 శాతం మంది 25 రోజుల్లోపే మరణించారు. అయినా సరే కరోనా సోకిన తరువాత 30 రోజుల్లో మృతి చెందినవారిని కోవిడ్ 19 మృతులుగా గుర్తించనున్నారు. 

మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్‌తో మృతి చెందినవారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. జిల్లా స్టాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల హెడ్ లేదా నిపుణుడు అయుండాలి. 

జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు లేదా బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధృవపత్రం ఇవ్వాల్సి ఉటుంది. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి.

Also read: Cibil Score: సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి, అనుసరించాల్సిన సులభమైన సూచనలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News