Covid Prediction Dose: దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పది రోజుల కింద వెయ్యి దిగువకు పడిపోయిన కేసులు మళ్లీ నాలుగువేల సమీపానికి చేరుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోనే మెజార్టీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రికాషన్ డోస్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే ఈ డోస్ ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై కాస్త గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం
సెకండ్ డోస్ తర్వాత 9 నెలలకు ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే స్పష్టంచేసింది. ప్రికాషన్ డోస్ లేదంటే బూస్టర్ డోస్ గా వ్యవహరించే ఈ టీకా వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని కొందరు ప్రభుత్వానికి సూచించారు. అయితే డోస్ కాలవ్యవధి తగ్గించే అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత తొమ్మిది నెలల అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలని తెలిపింది.
కరోనా కట్టడిలో భాగంగా తొలి రెండు డోసుల వాక్సిన్ ను దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా అందించింది కేంద్రం. ఈ ఏడాది జనవరి 10 నుంచి మూడో డోస్ పంపిణీని ప్రారంభించింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన హెల్త్ వర్కర్ల తో పాటు అరవై ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రికాషన్ డోస్ కూడా ఫ్రీగానే అందించింది. 18 ఏళ్లు పైబడ్డ వారు మాత్రం ఏప్రిల్ 10 నుంచి బూస్టర్ డోస్ వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఈ డోస్ మాత్రం కేవలం ప్రైవేటు సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో అవసరం ఉన్నవారు నిర్ణీత రుసుము చెల్లించి ప్రికాషన్ డోస్ వేయించుకుంటున్నారు.
కోవిషీల్డ్ తో పాటు కోవాక్సిన్ ప్రికాషన్ డోస్‌గా ఇస్తున్నారు. తొలి రెండు డోస్‌లు ఏ వాక్సిన్ తీసుకుంటే అదే వాక్సిన్ ప్రికాషన్ డోస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రూ. 225 ను వాక్సిన్ ధరగా నిర్ణయించింది కేంద్రం. సర్విస్ ఛార్జిగా ప్రైవేటు సెంటర్లు గరిష్టంగా రూ. 150 వసూలు చేసుకోవచ్చు.
Also Read: CJI NV Ramana: న్యాయమూర్తులు పరిధి దాటవద్దు..జస్టిస్ ఎన్‌వి రమణ వ్యాఖ్యల ఆంతర్యమేంటి
Also Read: Case on Puvvada Ajay Kumar: మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. స్టైఫండ్ లాక్కుంటున్నారనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.