కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు నేపధ్యంలో ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఇండియా సైతం కొత్త ఆంక్షలు విధించింది.
ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్((Omicron) గజగజలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. ఇజ్రాయిల్ సహా చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అన్నిదేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియా కూడా తాజాగా ఆంక్షలు(New Guidelines) జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర లేఖలు రాసింది. ముఖ్యంగా కరోనా రిస్క్ ఉన్న దేశాల్నించి వచ్చే ప్రయాణీకుల్ని క్లోజ్ మానిటరింగ్ చేయాలని సూచించింది. విదేశాల్నించి వచ్చేవారికి విమానాశ్రయాల్లో పలు ఆంక్షలు విధించింది.
అంతర్జాతీయ ప్రయాణాలపై గైడ్‌లైన్స్(International Travel Guidelines) జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) నేపధ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష కచ్చితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల్నించి వస్తున్నవారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అనివార్యం చేసింది. ఎవరైనా ప్రయాణీకుడికి కరోనా పాజిటివ్‌గా తేలితే..తక్షణం క్వారంటైన్‌కు పంపించాలని సూచించింది. బాధితుడి శాంపిల్స్‌పై తుది నిర్ధారణ కోసం జీనోమ్ స్వీక్వెన్స్(Genome Sequence)చేయించాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 15 దేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బొట్స్వానా, నమీబియా, హాంకాంగ్, జింబాబ్వే దేశాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని.. వ్యాక్సిన్ వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం(Central Government) ఆదేశించింది.
Also read: 1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తత, అంతర్జాతీయ ప్రయాణాలపై మార్గదర్శకాలు
ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
అంతర్జాతీయ ప్రయాణాలపై తాజా గైడ్‌లైన్స్ జారీ
విమానాశ్రయాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి