Flash news | CBI raids: కాంగ్రెస్ కీలక నేత ఇంట్లో సీబీఐ సోదాలు

CBI raids in DK Shivakumar's premises | కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డికే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు జరుపుతోంది. శివకుమార్‌తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ నివాసంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్‌కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Last Updated : Oct 5, 2020, 11:06 AM IST
Flash news | CBI raids: కాంగ్రెస్ కీలక నేత ఇంట్లో సీబీఐ సోదాలు

CBI raids in DK Shivakumar's premises | బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డికే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు జరుపుతోంది. శివకుమార్‌తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ నివాసంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్‌కి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన సమీప బంధువులు, సిబ్బంది నివాసాలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 చోట్ల సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 9 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల, ముంబైలో ఒక చోట సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. Also read : COVID19: తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

CBI raids DK Shivakumar premises

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతల్లో ముఖ్యుడైన శివకుమార్‌పై నమోదైన ఒక అవినీతి కేసు విచారణలో ( Corruption case against DK Shiva Kumar ) భాగంగా సీబీఐ ఈ సోదాలు చేపట్టినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Also read : CT Ravi Resignation: మంత్రి పదవికి సీటీ రవి రాజీనామా

CBI-raids-at-kpcc-chief-DK-Shivakumar-residences-office

గతంలో మనీ లాండరింగ్ కేసులో ( Money laundering case ) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కర్ణాటక పీసీసీ చీఫ్ శివ కుమార్‌ని ( KPCC chief DK Shivakumar ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న సోదాలు సీబీఐ సోదాలు కాదని.. అప్పటి మనీ లాండరింగ్ కేసులో ఆయన్ని ప్రశ్నిస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని శివకుమార్ సన్నిహితుడు ఒకరు వెల్లడించినట్టుగా లైవ్‌మింట్ కథనం పేర్కొంది. ఒకవేళ అదే నిజమైతే, కర్ణాటకలో తొమ్మిది చోట్ల, ఢిల్లీలో నాలుగు చోట్ల, ముంబైలో ఒక చోట అధికారులు సోదాలు ఎందుకు నిర్వహిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read : Revanth Reddy, Jagga Reddy, Uttam kumar Reddy arrest: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అరెస్ట్‌

ఇదిలావుంటే, మరోవైపు డికె శివకుమార్ నివాసాలు, కార్యాలయాల్లో జరుగుతున్న సీబీఐ సోదాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు సన్నాహం కాకుండా చేసేందుకు బీజేపి చేస్తున్న కుట్రల్లో భాగంగానే శివకుమార్‌పై సీబీఐ దాడులు జరుగుతున్నాయని  కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News