చెన్నై: కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో ఒకటవ తరగతి అడ్మిషన్ ఇచ్చేందుకు రూ.లక్ష లంచం అడిగిన ప్రిన్సిపాల్‌ను సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న ఓ దళిత కుటుంబం అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయగా.. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ అనంతన్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో కుటుంబం సీబీఐని ఆశ్రయించింది. బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అనంతన్‌ను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ ఘటన కేంద్రీయ విద్యాలయం వర్గాల్లో సంచలనం రేపింది.
1వ తరగతి అడ్మిషన్‌కు రూ.లక్ష