Goa Zuari River Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!

Goa Zuari River  Accident: గోవాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 28, 2022, 04:04 PM IST
  • గోవాలో ఘోర రోడ్డుప్రమాదం
  • నదిలోకి దూసుకెళ్లిన వాహనం
  • ఘటనాస్థలిలో సహాయక చర్యలు
Goa Zuari River Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!

Goa Zuari River Accident: గోవాలోని జువారి నదిలోకి స్పోర్ట్స్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలోని వారంతా జలసమాధి అయ్యారు. పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కోర్టలిమ్ వద్ద ప్రమాదం జరిగింది. జువారి నది వంతెనపై కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి స్పోర్ట్స్‌ కారు అదుపు తప్పింది. నది వంతెన రెయిలింగ్స్‌ను ఢీకొన్ని నదిలోకి పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భారత నావికా దళా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. 

ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాన్ని మహిళ డ్రైవ్ చేస్తున్నట్లు చెప్పారు. వాహనాన్ని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తోంది. కోస్ట్ గార్డ్ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Also read:Voter ID: ఇకపై 17 ఏళ్లకే ఓటు హక్కు..కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News