యూనియన్ బడ్జెట్ 2018: లక్ష గ్రామాలలో ఉచిత 'వైఫై'

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది.

Last Updated : Feb 1, 2018, 04:26 PM IST
యూనియన్ బడ్జెట్ 2018: లక్ష గ్రామాలలో ఉచిత 'వైఫై'

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటని జైట్లీ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ నేపథ్యంలో, ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి రూ.3,037 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా 5G సేవలు విస్తరించేందుకు.. టెలికాం పరిశ్రమ కోసం రూ.10,000 కోట్లను కేటాయించారు. ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నామని బడ్జెట్ 2018-19 ప్రసంగంలో జైట్లీ వివరించారు.

సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. వినియోగాన్ని పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్(ఒఎఫ్సీ)  ద్వారా కనీసం లక్ష గ్రామ పంచాయితీలను ప్రభుత్వం అనుసంధానిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటికే లక్ష గ్రామాల్లో ఈ లైన్ పూర్తయిందని.. ఆ లక్ష గ్రామాల్లో ఉచిత వైఫై సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. ఒక్కో గ్రామానికి ఐదు ఫ్రీ వైఫై స్పాట్ లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. లక్ష గ్రామాల్లో 5 లక్షల వైఫై స్పాట్ లు కల్పించడం ద్వారా.. గ్రామీణ భారతాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని.. త్వరలోనే ఫ్రీ వైఫై సేవలు అమల్లోకి వస్తుందని అన్నారు. 

Trending News