వారెవ్వా..! బీఎస్ఎన్ఎల్ 'చోటా ప్యాక్' ఆఫర్ అదిరింది

భారత ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది.

Last Updated : Aug 11, 2018, 09:02 PM IST
వారెవ్వా..! బీఎస్ఎన్ఎల్ 'చోటా ప్యాక్' ఆఫర్ అదిరింది

భారత ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్లను ప్రకటించింది. రూ.9, రూ.29లతో రెండు ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 10 నుంచే ఈ రెండు 'ఫ్రీడమ్ ఆఫర్-చోటా ప్యాక్' ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.

రూ.9 ఫ్రీడమ్‌ ఆఫర్‌- చోటా ప్యాక్‌ కింద ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌(ఢిల్లీ, ముంబై మినహాయించి), 80కేబీపీఎస్‌ స్పీడులో 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ ఒక్క రోజే మాత్రమే. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 25 మధ్యలో ఎప్పుడైనా ఈ ప్రయోజనాలను  పొందవచ్చు.

అలాగే 29 రూపాయల ఫ్రీడమ్‌ ఆఫర్‌-చోటా ప్యాక్‌ కింద (ఢిల్లీ, ముంబై తప్ప) ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 80కేబీపీఎస్‌ స్పీడులో రోజుకు 2జీబీ డేటా, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ వారం రోజులు. ఆగస్టు 25 వరకు ఈ ప్లాన్‌ ప్రయోజనాలు మారవు. ఆ తర్వాత రోజుకు 1జీబీ డేటాను, వారానికి 300 ఎస్‌ఎంఎస్‌లనే ఆఫర్‌ చేయనుంది.

ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌ 27 రూపాయలతో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌పై వారం రోజులపాటు రోజుకు 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తోంది.

Trending News