MIM Support: బీజేపీ గెలుపుకు కారణం ఎంఐఎం పార్టీనే: సాక్షి మహారాజ్

MIM Support: ప్రతిపక్షం ఆరోపిస్తుందే నిజమవుతుందా..బీజేపీ బీ టీమ్ ఎంఐఎం పార్టీనా..బీజేపీ గెలుపు కోసమే ఎంఐఎం వివిధ రాష్ట్రాల్లో పోటీకు దిగుతుందా..ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.

Last Updated : Jan 14, 2021, 01:15 PM IST
MIM Support: బీజేపీ గెలుపుకు కారణం ఎంఐఎం పార్టీనే: సాక్షి మహారాజ్

MIM Support: ప్రతిపక్షం ఆరోపిస్తుందే నిజమవుతుందా..బీజేపీ బీ టీమ్ ఎంఐఎం పార్టీనా..బీజేపీ గెలుపు కోసమే ఎంఐఎం వివిధ రాష్ట్రాల్లో పోటీకు దిగుతుందా..ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని హైదరాబాద్ జంట నగరాలకు పరిమితమై..ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తూ, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీ ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. బీజేపీతో ఆ పార్టీకుఅంతర్గతంగా ఒప్పందముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొన్నటి బీహార్ ఎన్నికలు ( Bihar Elections ) . రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ( West Bengal Elections ) ఎంఐఎం ( MIM ) ప్రమేయంపై ప్రధానంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయాన్ని ఖండిస్తున్నా..ఇప్పుడు స్వయంగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ( Bjp ) గెలుపుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin owaisi )  తోడ్పాటు అందిస్తున్నట్టు బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ ( Bjp mp sakshi maharaj ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం వల్లనే బీహార్ ( Bihar ) లో అత్యధిక స్థానాలు గెలిచామని తెలిపారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని మజ్లిస్ పార్టీ ప్రకటించిందని..అది తమకు ప్రయోజనకరమవుతుందని ఆయన చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం స్థానాల్లో కూడా ఎంఐఎం పార్టీ ( MIM Party ) పోటీకి సిద్ధమవుతూ..అదే రాష్ట్రానికి చెందిన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భార్‌తో ఒవైసీ చర్చలు జరిపారు. రెండు పార్టీలు కలిసి పోటీకు దిగుతున్నట్టు ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు..బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

Also read: Corona Vaccine: అన్ని రాష్ట్రాలు రెడీ.. తొలి దశలో 1.65 కోట్ల టీకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News