బెంగళూరు : కర్ణాటకలోని కపిలబెట్టలో ఏర్పాటు చేయబోతున్న 114 అడుగుల జీసస్ క్రిస్ట్ విగ్రహానికి వ్యతిరేకంగా సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లు నిరసన తెలిపాయి. "చలో కనకాపుర" అనే నినాదంతో బీజేపీ,ఆర్ఎస్ఎస్లు విగ్రహానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. గుజరాత్లో "స్టాచ్యూ అఫ్ యూనిటీ" పేరుతో 182 మీటర్ల ఎత్తు గల సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే.
కర్ణాటక కాంగ్రేస్ నేత డీకే శివకుమార్ తన మద్దతుదారులతో స్పందిస్తూ.. కార్యకర్తలందరు సంయమనంతో ఉండాలని, శాంతియుతంగా ఉండాలని సూచించారు. మరోవైపు శాంతి భద్రతల అదుపుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.
విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతం మెజారిటీ జనాభా క్రిస్టియన్లు ఉండగా, గత 400 సంవత్సరాల నుండి క్రిస్టియన్లు ఈ గ్రామంలో నిసిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొన్ని రోజులక్రితం జరిగిన క్రిస్మస్ వేడుకల సమయంలో విగ్రహ నిర్మాణ స్థలానికి సంబంధించిన తన పేరుమీద ఉన్న ధ్రువపత్రాలను ట్రస్ట్కు అందజేశారు. విగ్రహాన్ని హార్డ్ గ్రానైట్తో నిర్మించాలని ఆయన సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..