Uma Bharti: బీజేపీ నాయకురాలు ఉమాభారతికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనావైరస్ (coronavirus) బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Last Updated : Sep 27, 2020, 11:45 AM IST
Uma Bharti: బీజేపీ నాయకురాలు ఉమాభారతికి కరోనా

Uma Bharti tests positive for coronavirus: న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనావైరస్ (coronavirus) బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు సైతం కరోనాతో మరణించారు. అయితే.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి (Uma Bharti) కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆమె ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె వరుస ట్విట్లను చేసి ఈ విధంగా రాశారు. తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని ఉమా భారతి సూచించారు. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు

ప్రస్తుతం తాను హరిద్వార్ - రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. 4 రోజుల తర్వాత మళ్లీ కోవిడ్ -19  (Covid-19) పరీక్ష చేయించుకుంటానని.. పరిస్థితి అలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తానంటూ ఉమా భారతి ట్వీట్ చేశారు. మూడు రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నానని.. అయితే ఈ రోజుతో హిమాలయ పర్వత ప్రయాణం ముగిసిన వెంటనే వైద్యసిబ్బందిని పిలిచి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఉమాభారతి ట్విట్‌లో తెలిపారు. ఇదిలాఉంటే.. హిమాలయ పర్యటనలో కోవిడ్ -19 నిబంధనలను అనుసరించినప్పటికీ ఆమె కరోనావైరస్ బారిన పడ్డారని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

Trending News