Bird flu in Kerala : కరోనా పోకముందే బర్డ్ ఫ్లూ వైరస్.. 13,000 కోళ్లను వధించేందుకు సిద్ధం

కరోనావైరస్ భయం ఓవైపు వేధిస్తుండగానే మరోవైపు కేరళలో బర్డ్ ఫ్లూ వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా వైరస్ కారణంగానే చికెన్ తినొచ్చా లేదా అని ఆందోళనలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా బర్డ్ ఫ్లూ రావడం చికెన్ ప్రియులను మరింత భయపెడుతోంది. 

Last Updated : Mar 8, 2020, 08:17 AM IST
Bird flu in Kerala : కరోనా పోకముందే బర్డ్ ఫ్లూ వైరస్.. 13,000 కోళ్లను వధించేందుకు సిద్ధం

తిరువనంతపురం: కరోనావైరస్ భయం ఓవైపు వేధిస్తుండగానే మరోవైపు కేరళలో బర్డ్ ఫ్లూ వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా వైరస్ కారణంగానే చికెన్ తినొచ్చా లేదా అని ఆందోళనలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా బర్డ్ ఫ్లూ రావడం చికెన్ ప్రియులను మరింత భయపెడుతోంది. కేరళలోని కొయికోడ్‌ జిల్లాలో వెస్ట్ కొడియత్తూర్, వెంగెరి గ్రామాల్లోని కోళ్లఫారంలో బర్డ్ ఫ్లూ బయట పడటంతో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. నిత్యం ఓ 200 కోళ్లు మృత్యువాతపడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయగా బర్డ్ ఫ్లూ కోణం వెలుగుచూసింది. 2016 తర్వాత కేరళలో మళ్లీ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ రావడం ఇదే తొలిసారి. దీంతో శుక్రవారమే తిరువనంతపురంలో కేరళ పశుసంవర్థక శాఖ మంత్రి కె రాజు సంబంధిత అధికారులతో ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు. 

బర్డ్ ఫ్లూ వైరస్‌కి చెక్ పెట్టేందుకు సుమారు 13,000 కోళ్లను వధించాలని ఈ సందర్భంగా కేరళ సర్కార్ నిర్ణయించుకుంది. ఆ రెండు కోళ్ల ఫారమ్స్‌లోని కోళ్లతో పాటు వాటికి సమీపంలోని ఇతర జాతి పక్షులను సైతం వధిస్తే కానీ బర్డ్ ఫ్లూను పూర్తి స్థాయిలో మట్టుపెట్టలేమని భావిస్తున్న కేరళ సర్కార్.. ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News