Biperjoy Super Cyclone: గత వారం రోజులుగా వణికిస్తున్న బిపర్‌జోయ్ సూపర్ సైక్లోన్ ఎట్టకేలకు తీరం తాకింది. గుజరాత్, పాకిస్తాన్ తీరాల మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో భయంకరమైన సైక్లోన్ ఐ ఏర్పడింది. ఈ ప్రక్రియ పూర్తయేసరికి మరోసారి విరుచుకుపడనున్న భారీ వర్షాలు, ఈదురు గాలులపైనే ఇప్పుడు ఆందోళన నెలకొంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ గుజరాత్ తీరాన్ని తాకి..ప్రస్తుతం గుజరాత్ ఓడరేవు జఖౌ, పాకిస్తాన్ కరాచీ తీరాల మధ్య తీరం దాటుతోంది. ఫలితంగా ఇటు గుజరాత్ , అటు పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. గుజరాత్, కరాచీ తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు 3-6 మీటర్లు ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం తాకిన సందర్భంగా గుజరాత్ సముద్ర తీర ప్రాంతం ఉపరితలంలో సైక్లోన్ ఐ ఏకంగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి కన్పిస్తోంది. సైక్లోన్ ఐ ఇవాళ అర్ధరాత్రికి తీరం దాటనుంది. సాధారణంగా తీరం దాటే ముందు దాటిన తరువాత తుపాను ప్రభావం బీభత్సంగా ఉంటుంది. దాటే సమయంలో మాత్రం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి తీరం దాటాక రాకాసి గాలులతో విధ్వంసం సృష్టించనుంది.
అందుకే ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రికి గుజరాత్‌లోని మాండ్వీ, పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య తీరం దాటే ప్రక్రియ పూర్తి కావచ్చు. బిపర్‌జోయ్ సూపర్ సైక్లోన్ ప్రభావం గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై తీవ్రంగా ఉండవచ్చు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలకై సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బిపర్‌జోయ్ సూపర్ సైక్లోన్ కారణంగా ఇప్పటికే గుజరాత్ కచ్ తీర ప్రాంతంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో గాలుల తీవ్రత కూడా పెరగవచ్చని సూచించింది. సైక్లోన్ ఐ ఏకంగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడటం ఆందోళన కల్గిస్తోంది.
Also read: Cyclone Biparjoy Update: ఇవాళ తీరం దాటనున్న బిపార్జోయ్ తుపాన్.. అప్రమత్తమైన గుజరాత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook