Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం

Slippers Hurled at Tejashwi Yadav | బిహార్‌ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంలో భాగంగా ఔరంగాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ కీలక నేత, విపక్ష కూటమి బిహార్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Last Updated : Oct 21, 2020, 11:12 AM IST
  • ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బిహార్ రాజకీయాలు వేడేక్కుతున్నాయి
  • విపక్ష కూటమి బిహార్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు చేదు అనుభవం
  • మాజీ మంత్రి తేజస్వీ యాదవ్‌పై గుర్తు తెలియని దుండగులు చెప్పులు విసిరారు
Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election 2020) దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కుతున్నాయి. తమ ప్రత్యర్థి పార్టీ, కూటముల నేతలకు చెక్ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ (RJD) కీలక నేత, విపక్ష కూటమి బిహార్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)కు చేదు అనుభవం ఎదురైంది. సభా వేదికపై కూర్చున్న బిహార్ మాజీ మంత్రి తేజస్వీ యాదవ్‌పై కొందరు గుర్తు తెలియని దుండగులు చెప్పులు (Slippers hurled at Tejashwi Yadav) విసిరారు. 

కాంగ్రెస్ (Congress) అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంలో భాగంగా ఔరంగాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. సభా వేదిక మీదకు చేరుకున్న తేజస్వీ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని అగంతకులు రెండు చెప్పులు ఆర్జేడీ నేత మీదకి విసిరారు. ఓ చెప్పు ఆయన పక్కగా దూసుకెళ్లి పడిపోగా, ఏం జరిగిందోనని తేజస్వీ యాదవ్ గమనిస్తుండగానే మరో చెప్పు ఆయనకు తాకి, ఒడిలో పడింది.

 

 

 

జాతీయ మీడియా ఏఎన్ఐ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్‌ తివారీ ఈ ఘటనను ఖండించారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి కూటమి ఈ చర్యలకు పాల్పడి ఉంటుందని ఆరోపించారు. కీలక నేతలకు సైతం సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అయితే తనకు ఎదురైన చేదు అనుభవంపై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఏమాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించకుండానే తేజస్వీ ప్రసంగించడం గమనార్హం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x