Bihar Election Result Live: సాయంత్రం వరకూ కౌంటింగ్.. ఆధిక్యంలో ఎన్డీఏ

బీహార్ ఎన్నికల ఫలితాల (Bihar Election Result ) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 127 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

Last Updated : Nov 10, 2020, 02:06 PM IST
Bihar Election Result Live: సాయంత్రం వరకూ కౌంటింగ్.. ఆధిక్యంలో ఎన్డీఏ

Bihar Election Result 2020 Update: పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాల (Bihar Election Result ) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట మహాఘట్‌బంధన్ ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒకటిన్నర వరకు... ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 127 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అయితే సాయంత్రం వరకు బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై స్పష్టత వచ్చేలా కనిపించడంలేదు. ఈ క్రమంలో దీనిపై ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది. 

ఈ ఎన్నిక‌ల్లో సుమారు 4.10 కోట్ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారని.. ఇప్ప‌టి వరకు కేవ‌లం 92 ల‌క్ష‌ల ఓట్ల‌ను మాత్ర‌మే లెక్కించిన‌ట్లు ఆ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారి (Chief Electoral Officer of Bihar) హెచ్ఆర్ శ్రీనివాస్ తెలిపారు. గ‌తంలో 25 నుంచి 26 రౌండ్లు మాత్ర‌మే ఉండేదని, కానీ ఈ సారి ఓటింగ్ శాతం పెర‌గ‌డంతో.. కొన్ని ప్ర‌దేశాల్లో 35 రౌండ్ల వ‌ర‌కు కౌంటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ కార‌ణం వ‌ల్లే సాయంత్రం వ‌ర‌కు కూడా కౌంటింగ్ జ‌రిగే అవ‌కాశముందని శ్రీనివాస్ వెల్లడించారు. Also read: Bihar Election Result Live: పుంజుకున్న ఎన్డీఏ.. సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యం

అయితే మధ్యాహ్నం 1.30 వరకు.. ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. 
ఎన్డీఏ 127 సీట్లల్లో లీడ్‌లో ఉంది. BJP 74, JDU 48, VIP 4, HAM 1 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. 
మహాఘట్‌బంధన్ 106 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  RJD 66, Congress 21, Left 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
దీంతోపాటు BSP 2, LJP 1, AIMIM 3, independents 4 స్థానాల్లో ముందజలో ఉన్నారు.

Also read: Bihar Election Result Live: పోటా పోటీ ఆధిక్యంలో ఎన్డీఏ, కూటమి\

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News