స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి సీఎం నితీశ్ కుమార్ లేఖ రాశారు. పోర్చుగీసు వారి నుంచి గోవాకు విముక్తి కల్పించడంతో పాటు మహిళా సాధికారికతకు లోహియా చేసిన కృషిని నితీశ్ లేఖలో వివరించారు.
स्व. डॉ. राम मनोहर लोहिया जी को भारत रत्न के सम्मान से सुशोभित करने के सम्बंध में माननीय प्रधानमंत्री को पत्र लिखा।https://t.co/d0NvXrpggZ
— Nitish Kumar (@NitishKumar) April 29, 2018
నెహ్రూ కాలంలోనే కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి లోహియా చేసిన కృషిని కూడా నితీశ్ తన లేఖలో ప్రస్తావించారు. దేశ రక్షణ, శ్రేయస్సు కోసం శ్రమించిన వ్యక్తిని గౌరవించుకోవడం మన బాధ్యతని మూడు పేజీల లేఖలో వివరించారు. లోహియా దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన వర్ధంతి అయిన అక్టోబర్ 12 రోజున భారతరత్న పురస్కారం ఇవ్వాలని, అదే రోజు గోవా ఎయిర్పోర్ట్కు ఆయన పేరు పెట్టాలని నితీష్ ఆ లేఖలో కోరారు.