President Droupadi Murmu Presents Bharata Ratna: దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారత్ రత్న పురస్కారాల ప్రధానం వేడుకగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ వేడుకకు.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్, దేశ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియల్ లీడర్ మల్లికార్జున్ ఖర్గె తదితరులు హజరయ్యారు. పలురంగాల్లో విశేషంగా సేవలంగించిన వారికి కేంద్రం భారతరత్న పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది కేంద్రం ఐదుగురిని నామినెట్ చేసింది. బీహర్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్.కే. అధ్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్, అగ్రికల్చర్ ఎంఎస్ స్వామినాథన్ లకు అత్యున్నత అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో నలుగురికి చనిపోయిన తర్వాత అవార్డులను ప్రదానం చేశారు.
కర్పూరీ ఠాకూర్ తరపున ఆయక కొడుకు రామ్ నాథ్, చౌదరీ చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కూతురు నిత్యారావు పురస్కారాలను స్వీకరించారు. పీవీ నర్సింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు పురస్కార అందుకున్నారు. పీవీ నరసింహారావు దేశానికి తొమ్మిదవ ప్రధానిగా పనిచేశారు. అదే విధంగా ఆయన అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను ఒకగాడిలో పడేలా చేశారు. ఆయనను బహుభాషా కోవిధుడు అనికూడా పిలుస్తారు.
Read More: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..
చౌదరీ చరణ్ సింగ్ రైతు బాంధవుడు అంటారు. రైతుల కోసం అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ ను.. జననాయక్ అని పిలుస్తారు. బీహార్ కు రెండు సార్లు సీఎంగా పనిచేసి, ఉన్నతమైన ఆలోచనలతో గౌరవింపబడ్డారు. ఇక బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అధ్వానికీ అనారోగ్యం వల్ల ఆయన రాలేకపోయినట్లు సమాచారం. దీంతో రేపు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ ఆయన ఇంటికి వెళ్లి అద్వానికి భారతరత్న ప్రధానం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 53 మందికి భారతరత్న పురస్కారాలను ప్రదానం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook