Bharat Jodo Nyay Yatra: కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దెదించడమే టార్గట్ గా కాంగ్రెస్ తో పాటు అన్ని అపోసిషన్ పార్టీలు పనిచేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల్లో మంచి గ్రాఫ్ సంపాదించారు. అదే విధంగా దీన్ని కంటిన్యూటీగా ప్రస్తుతం రాహుల్ దేశంలో భారత్ జోడి న్యాయ యాత్రను కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్రస్తుతం రాహుల్ యాత్ర.. వెస్ట్ బెంగాల్ లోకి ప్రవేశించింది. ఇదిలా ఉండగా.. మాల్దా జిల్లాలోని లాభా బ్రిడ్జిపైకి బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్రను వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని ఆగంతకులు రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి.
ఈ ఘటన జరిగినప్పుడు రాహుల్ బస్సులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పూర్తిగా భద్రతా లోపమని కాంగ్రెస్ నేతలు కేకలు వేశారు. ఇదిలా ఉండగా.. '' ఈరోజు మాల్దాలో సీఎం మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారని తెలిపారు.
అందుకే రాహుల్ కు తక్కువ మంది పోలీసు అధికారులను నియమించారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి జెండాను బదిలీ చేసిన జెండా బదిలీ వేడుకను ప్రస్తావిస్తూ చెప్పారు. ప్రస్తుతం ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook