Covishield Miracle: కొవిషీల్డ్​ అద్భుతం.. ఐదేళ్లుగా మంచాన పడ్డ వ్యక్తి కోలుకున్నాడట!

Covishield Miracle: ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి.. కరోనా టీకా తీసుకున్నాక ఆరోగ్యవంతుడైన ఘనటన ఝార్ఖండ్​లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 12:29 PM IST
  • Covishield Miracle: ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి.. కరోనా టీకా తీసుకున్నాక ఆరోగ్యవంతుడైన ఘనటన ఝార్ఖండ్​లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Covishield Miracle: కొవిషీల్డ్​ అద్భుతం.. ఐదేళ్లుగా మంచాన పడ్డ వ్యక్తి కోలుకున్నాడట!

Covishield Miracle: ఝార్ఖండ్​లో అద్భుతం చోటు చేసుకుంది. ఓ ప్రమాదం కారణంగా.. ఐదేళ్లుగా పూర్తిగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి కరోనా టీకా తీసుకోవడంతో కోలుకున్నాడు. జనవరి 4న ఆ వ్యక్తికి కొవిషీల్డ్ టీకా ఇవ్వగా మరునాడే.. అతడు లేచి నిలుచోవడమే కాదు.. మాట్లాడటం కూడా ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు (Jharkhand man Recovered After taking Covishield ) చెప్పారు.

ఇంతకి ఏమైందంటే..

ఝార్ఖండ్​లోని బోకారో జిల్లా ఉతాసారా పంచాయతీ పరిధిలోని సల్​ గాడీహ్​ గ్రామానికి చెందిన.. దులార్​చంద్ ముండా (Dularchand Munda) అనే 55 ఏళ్ల వ్యక్తి.. 5 ఏళ్ల క్రితం ఓ ప్రమాదానికి గుగరయ్యాడు. వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. మాట కూడా పడిపోయింది. ఏడాది కాలంగా పూర్తిగా కదలలేని స్థితికి చేరుకున్నాడు.

అయితే కొవిడ్ కట్టడికి వైద్య సిబ్బందే ఇంటిటికి వెళ్లి కొవిడ్ టీకా ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 4న దులార్​చంద్ ముండా ఇంటికి వెళ్లిన వైద్య సిబ్బంది.. అతడికి కొవిషీల్డ్ మొదటి డోసు వ్యాక్సిన్ (Covishield first Dose)​ వేశారు. ఆ మరునాడు జరిగిన అద్భుతం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఐదేళ్లుగా మంచానికి పరిమితమైన ఆ వ్యక్తి ఒక్క సారిగా అటు ఇటు కదలటం లేచి నిలుచోవడమే కాకుండా.. మాట్లాడటం కూడా (Covishield vaccine Miracle) ప్రారంభించాడు.

ఈ విషయాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బొకారో సివిల్ సర్జన్ డాక్టర్​ జితేంద్ర కుమార్ వెల్లడించారు. అయితే గత కొంతకాలంగా ఆ వ్యక్తి పూర్తిగా మంచానికే పరిమితమైన విషయం నిజమేనని తేల్చారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టనున్నట్లు వివరించారు.

Also read: Covaxin Universal vaccine: యూనివర్సల్​ వ్యాక్సిన్​గా భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'!

Also read: India Covid Cases Today: భారత్‌లో కరోనా పంజా.. రెండున్నర లక్షలకు పైగా కొత్త కేసులు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News